ప్రభాస్ కల్కి 2898AD సినిమా మరికొన్ని రోజుల్లో చాలా గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కరెక్ట్ గా ఒక వారం గడిస్తే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యొక్క అసలైన సందడి కనిపిస్తుంది.ఇండియాలోనే ఇప్పటి దాకా ఎవరు చూపించని కథను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరపైకి తీసుకురాబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించింది. తప్పకుండా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకమైతే పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత అశ్విని దత్  విడుదలకు ముందు చిన్న సినిమా అని విడుదల తర్వాత మాత్రం చాలా పెద్ద సినిమా అవుతుంది అని చెప్పడం చాలా ఆసక్తిగా అనిపించింది. అయితే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ మరి ఇంత స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు కూడా ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి దాకా బుజ్జి భైరవ అనే సౌండ్ తప్పించి జనాల్లో పెద్దగా కల్కి గురించే చర్చలు  కనిపించడం లేదు. 


సినిమాకు సంబంధించిన ఒక పంజాబీ సాంగ్ ని కూడా విడుదల చేశారు. అయితే అది వచ్చిన వెంటనే అంత బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఫ్యాన్స్ సరిపోట్లేదు ఇంకా ఏదో మ్యాజిక్ కావాలి అని ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కూడా బాగానే ఎట్రాక్ట్ చేసింది. అయితే ఎన్ని వీడియోలు సాంగ్స్ విడుదల చేసిన కూడా సినిమాకు సంబంధించిన మేకర్స్ తో పాటు ఆర్టిస్ట్ లు అందరూ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే ఆ హడావిడి కిక్ ఇచ్చేలా ఉంటుంది. ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన చాలా విషయాల గురించి చర్చిస్తే సినిమాను చూడాలి అనే ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది.అయితే అంచనాల స్థాయిని ఒక లిమిట్ లో ఉంచాలని అనుకున్నారో ఏమో కానీ మరీ ఇంత తక్కువగా అంటే రెబల్ ఫ్యాన్స్ సంతృప్తి చెందడం లేదు. పాన్ వరల్డ్ ప్రాజెక్టు అనే మాటే కానీ అసలు ఆ రేంజ్ లో ప్రమోషన్స్ సౌండ్ వినిపించడం లేదు. ముఖ్యంగా నార్త్ లో ఇప్పటి దాకా సినిమాకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. అక్కడ ఎంతో కొంత ప్రత్యేకంగా ఈవెంట్స్ నిర్వహిస్తేనే మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: