తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. వరుణ్ "ముకుంద" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీ తో ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం దక్కినప్పటికీ ఈ మూవీ ద్వారా కొంత మంది ఆడియన్స్ ను ఈయన ఆకట్టుకోగలిగాడు. ఇక ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈయన క్రేజ్ బాగానే పెరిగింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన వరుసగా అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు.  

గని , గాండీవ దారి అర్జున , ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలతో భారీ ఆపజాయలను వరుణ్ అందుకున్నాడు. మధ్యలో ఎఫ్ 3 సినిమాతో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న వరుణ్ తో పాటు ఈ మూవీ లో వెంకటేష్ కూడా హీరో గా నటించడంతో ఈ విజయంలో సగం గుర్తింపును ఆయనే కొట్టేశాడు. దానితో ఈ మూవీ ద్వారా వరుణ్ తేజ్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఇలా వరుసగా అపజయాలు దక్కుతూ ఉండడంతో కచ్చితంగా ఇకపై వచ్చే సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలి అని ఈ యువ నటుడు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈయనకు చాలా మంది కథ లను వినిపించగా అందులో ఏకంగా 12 కథలను వరుణ్ రేజాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి ఓకే చేసే కథ తో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయం కొట్టాలి అనే ఉద్దేశం తోనే 12 కథలను వరుణ్ రిజెక్ట్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన మట్కా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఎఫ్ 4 మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: