దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ హస్తం ఉన్నట్లు వెల్లడికావడంతో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి.రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌తో పాటు అరెస్టయిన కన్నడ నటి పవిత్ర గౌడపై ట్రోల్స్ చేస్తున్న ట్రోలర్స్‌ని సీనియర్ సినీ నటి కస్తూరి శంకర్ తనదైన స్టైల్ లో విమర్శించారు.ఈ ఘటనలో పవిత్ర గౌడ తరపున సీనియర్ నటి మాట్లాడటం చర్చనీయాంశమైంది..భారతీయుడు ఫేం కస్తూరి శంకర్ ఈమధ్య తెలుగు బుల్లితెరపైనా నటిగా వెలుగులు విరజిమ్మిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో బుల్లితెర ఇంకా వెండితెర అవకాశాల్ని అందుకుంటున్నారు కస్తూరి. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా ఆమె అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు సపోర్ట్ చేస్తూ కస్తూరి శంకర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.


ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి పవిత్ర గౌడకు సపోర్ట్ గా మాట్లాడుతూ... పవిత్ర కేసులో స్వయంకృత న్యాయమూర్తులైన యూట్యూబ్ సోషల్ మీడియా ప్రతినిధుల వ్యవహార శైలిని ఆమె ఖండించారు. పవిత్ర గౌడ దర్శన్ స్నేహితురాలని, అతని భాగస్వామి కాదని, పైగా ఆమె వ్యక్తిగత జీవితం తన సొంత వ్యవహారం అని పేర్కొంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి జనం సెలబ్రిటీలను తమ ఆస్తిగా భావించి రాజా హరిశ్చంద్రులంటూ తీర్పులు ఇస్తున్నారని .. తమ ప్రాణాలను కూడా పట్టించుకోకుండా ఇతరులపై తీర్పు చెప్పేందుకు తహతహలాడుతున్నారని కస్తూరి తీవ్రంగా వ్యాఖ్యానించారు.''నేను హింసను అస్సలు క్షమించను, కానీ బాధితుడు అమాయకుడు కాదు.. అతడు ఆమెను వేధిస్తున్నాడు. ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపడానికి అతడికి అసలు ఏ హక్కు ఉంది? దర్శన్ చేసింది కూడా పెద్ద తప్పు అని నేను అంగీకరిస్తున్నాను. కానీ వాటికి కోర్టులు ఉన్నాయి. పోలీసులు కూడా ఉన్నారు. సెలబ్రిటీలను వేధించే హక్కు ప్రజలకు అసలు ఎవరు ఇచ్చారు? మీరే నిర్ణయించుకోండి..." అని ఆవేశంగా కోట్ చేస్తూ వైరల్ కామెంట్స్ చేశారు కస్తూరి.

మరింత సమాచారం తెలుసుకోండి: