సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ వసూళ్లు మాత్రం బాగా చేసింది అని చెప్పాలి. అదే హిట్ అయి ఉంటే గనక కచ్చితంగా 300 కోట్లకు పైగానే రాబట్టేది అని అంటున్నారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే దాని పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా వంటి సినిమాలు ఎంతలా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పటికీ ఆ సినిమాలు టీవీల్లో వస్తే ఎంతో

 ఇష్టంగా చూస్తూ ఉంటారు ఆడియన్స్. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే భారీ అంచునాలు ఉంటాయి. అందులో భాగంగానే ఆ రెండు సినిమాల తరువాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమాపై కూడా అదే స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు  మహేష్ బాబు కెరియర్ లో 29వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచునాలు ఉన్నాయి. ఇక  ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో శ్రమ చేయబోతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్

 మీడియా వేదికగా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇక ఆ సినిమా కోసం ఇప్పటికే సుకుమార్ సందీప్ రెడ్డివంగా కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్లు లైన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు అందులో స్టార్ డైరెక్టర్  అనిల్ రావిపూడి సైతం ఉన్నారట. మహేష్ 30వ సినిమాడైరెక్టర్ తో చేసినప్పటికీ తన 31వ సినిమా మాత్రం ఖచ్చితంగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందని అంటున్నారు. అంతేకాదు గుంటూరు కారం సినిమా షూటింగ్ సమయంలోనే ఆ సినిమాకి సంబంధించిన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు అన్న వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది తెలియదు. ఇదిలా ఉంటే మరోవైపు ఈసారి వీళ్ళిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా అయ్యుంటుందని అంటున్నారు. త్రివిక్రమ్ సైతం ఇదే ప్లాన్ చేస్తున్నాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: