రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ఒక్క రోజు ప్రచారం చేసినందుకు అల్లు అర్జున్ జీవితాంతం రిగ్రెట్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఏ విషయంలో అయినా పెట్టుకోవచ్చు కానీ తమకు సంబంధం లేని రాజకీయ విషయాల్లో మాత్రం వేలు పెట్టకూడదు. అందుకే మహేష్ బాబు, ప్రభాస్ లు పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటాడు. ఎన్టీఆర్ కూడా గతంలో రిస్క్ చేసి దెబ్బ తిన్నాడు. ఇప్పుడు రాజకీయాలకి దూరం అయ్యాడు.ఇక బన్నీ తన మిత్రుడికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో వెళ్లాను తప్ప ఇందులో రాజకీయం ఏమీ లేదని  వివరణ ఇచ్చుకున్నా సరే.. అది మెగా అభిమానుల్లో చాలామందికి నచ్చలేదు. సపోర్ట్ చేస్తే చెయ్.. మరీ ప్రచారాలకి వెళ్లడం ఏంటని అంటున్నారు.ఓవైపు వైసీపీ మీద పోరాడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా కూడా అండగా నిలబడి పిఠాపురానికి వెళ్లి ప్రచారం కూడా చేస్తే.. బన్నీ అదే టైంలో వెళ్లి నంద్యాలలో శిల్పా రవి కోసం క్యాంపైనింగ్ చేయడాన్ని కౌంటర్ గా సూచిస్తున్నారు నెటిజన్స్. 


దీన్ని జనసైనికులు, మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. బన్నీ ఈ పని చేసి నెల రోజులు దాటినా కూడా ఈ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చాక మరింత రెచ్చిపోయి మరీ బన్నీని బాగా ట్రోల్ చేస్తున్నారు.ఈమధ్యనే పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. బన్నీని సోషల్ మీడియా ఖాతాల్లో అన్‌ఫాలో చేసిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మరింతగా బన్నీని టార్గెట్ చేస్తున్న సంకేతాలు బాగా కనిపిస్తున్నాయి. ఇకపై బన్నీని ఎంతమాత్రం ఓన్ చేసుకోకూడదని, తన సినిమాలు కూడా చూడకూడదని మెగా ఫ్యాన్స్‌లో ఓ వర్గం గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా బాగా పెరుగుతున్నాయి.'పుష్ప-2' రిలీజ్ వాయిదా పడటానికి కూడా ఈ ఇష్యూలే కారణం అని తెలుస్తుంది. ఏది ఏమైనా సొంత ఫ్యామిలిని బన్నీ ఇలా దూరం చేసుకొని ఇప్పుడు రిగ్రేట్ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: