టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్గా నటించిన గుర్తింపు సంపాదించుకోలేకపోయినా వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం లేడీ విలన్ గా ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. తెలుగులో రవితేజ నటించిన క్రాక్ సినిమాతో తనలోని ఉండే లేడీ వీళ్ళనిజాన్ని బయటకి తీసింది. ఇందులో జయమ్మ పాత్ర అద్భుతంగా నటించడంతో ఆ తర్వాత వరుస పెట్టి అవకాశాలు వెలుపడ్డాయి.. బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలలో అందుకున్న ఈ ముద్దుగుమ్మ. ఇటీవలె హనుమాన్ సినిమాతో కూడా భారి విజయాన్ని అందుకుంది.

అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న వరలక్ష్మి వివాహ విషయాన్ని కూడా ఇటీవలే వెల్లడించింది. తను ప్రేమించిన వ్యక్తితో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన బాయ్ ఫ్రెండ్ నీకోలాయ్ సచ్ దేవ్ ను ప్రేమించి వివాహం చేసుకుంటున్నది. వీరిద్దరూ పెళ్లి థాయిలాండ్లో జరగబోతోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలను కూడా పిలవడం జరిగింది. వెడ్డింగ్ కార్డ్స్ పంచుతూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ కి సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


అసలు విషయంలోకి వెళ్తే నీకోలాయ్ కు ముందుగానే వివాహమయ్యింది.. కొన్ని కారణాల చేత తన మొదటి భార్యని నుంచి విడిపోయిన ఇతను వరలక్ష్మితో 14 ఏళ్ల నుంచి బాగా పరిచయం ఉందట. మొదట వీరిద్దరూ స్నేహితులుగా ఉన్న ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.నీకోలాయ్ కు ఇది రెండో వివాహం.. అంతే కాకుండా ఇతడికి ఇదివరకే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య పేరు కవిత 2010లో మిస్సెస్ గ్లా డ్రాగ్స్ టైటిల్ని కూడా ఆమె గెలుచుకున్నదట. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. తాజాగా నీకోలాయ్ , వరలక్ష్మి ఇద్దరు కలిసి తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు వైరల్ గా కావడంతో వరలక్ష్మి కాబోయే భర్తకు ఇంత పెద్ద కూతురా అంటూ షాక్ అవుతున్నారు.నీకోలాయ్ కూతురు వయసు 15 సంవత్సరాలు. ఈమె కూడా వెయిట్ లిఫ్టింగ్ లో ఛాంపియన్ కూడ.

మరింత సమాచారం తెలుసుకోండి: