ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ గా మారిపోవడంతో ఇప్పుడు రాష్ట్రా రాజకీయాలలో అతడు కీలక శక్తిగా మారాడు. ప్రస్తుతం పవన్ పూర్తి చేయవలసిన ‘హరి హర వీరమల్లు’ ‘ఓజీ’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల పై ఆసినిమాల దర్శక నిర్మాతలకు కూడ ఎటువంటి క్లారిటీ లేడు.ఇలాంటి పరిస్థితుల మధ్య గత కొన్నిరోజులుగా ట్రెండింగ్ గా మారిపోతున్న అకిరా నందన్ పై తీవ్ర ఒత్తిడి పెరిగి పోతోంది. వాస్తవానికి అకిరా కు సినిమా రంగం పట్ల అభిలాష ఉన్నప్పటికీ నటన పై కన్నా మ్యూజిక్ డైరెక్షన్ ఫిలిమ్ మేకింగ్ లపై చాల ఆశక్తి ఉంది. అయితే పవన్ అభిమానులు మాత్రం అతడిని పవన్ వారసుడుగా ఫిలిమ్ ఇండస్ట్రీలో చూడాలని అనుకుంటున్నారు,గత కొన్ని రోజులుగా పవన్ ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడి ని కలిసినప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ప్రతి సందర్భంలోనూ అకిరా పవన్ పక్కన ఉండటంతో మీడియా కెమెరా దృష్టి అంతా అకిరా చుట్టూ తిరిగింది. లేటెస్ట్ గా సుదర్శన్ ధియేటర్ లో ‘తమ్ముడు’ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన స్పెషల్ షోకు ఎవరు ఊహించని విధంగా అకిరా నందన్ రావడంతో ధియేటర్ లోని ప్రేక్షకులు అంతా అకిరా నందన్ తో సెల్ఫీలు తీయించుకోవడానికి పరుగులు పెట్టారు.ప్రస్తుత పరిస్థితులలో ఎవరైనా ఒక ప్రముఖ నిర్మాత అకిరా నందన్ తో ఒక లవ్ స్టోరీ మూవీని తీస్తే అటు కలక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఇది ఇలా ఉండగా పవన్ అకిరా నందన్ ను హీరోగా ఎంట్రీ చేయడానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో మాట్లాడడని ఒక మంచి కథ కోసం అన్వేషణ సాగుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే 20 సంవత్సరాల అకిరా నందన్ తన వయసుకు మించిన బరువు మోస్తున్నాడు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: