తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు ఉన్న.. ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న అగ్రస్థానం ఎవరిది అంటే మాత్రం ముందుగా ఒకే పేరు వినిపిస్తూ ఉంటుంది. అదే మెగాస్టార్ చిరంజీవి. దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయన ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దగా కొనసాగుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ హామీ ఇస్తూ ఉంటారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా సమస్యలు అన్నింటినీ కూడా ఎంతో సామరస్యంగా పరిష్కరిస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి.అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఉన్న ఆయన ఎంతో ప్రత్యేకం అని  చెప్పాలి.


 అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇక మరికొన్ని రోజుల్లో ఒక ఉన్నతమైన హోదాని పొందబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి  ఇప్పటికే పద్మ అవార్డులను రెండుసార్లు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి   మరికొన్ని రోజుల్లో ఏకంగా రాజ్యసభ పదవిని చేపట్టబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వబోతున్నారంటు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు సీఎం గా ప్రమాణస్వీకారం చేసే సమయంలో కూడా ఎంతో ఆప్యాయంగా చిరంజీవిని పలకరించారు నరేంద్ర మోడీ. అంతేకాదు పవన్ కళ్యాణ్ చిరంజీవిని రెండు వైపులా నిలబెట్టుకుని   అటు అభిమానులు అందరికీ కూడా అభివాదం చేశారు అన్న విషయం తెలిసిందే.


 దీంతో చిరంజీవికి తప్పకుండా రాజ్యసభ సీట్ దక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి  అయితే ఈ వార్తలపై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత స్పందించారు  దాని గురించి నాకైతే ఏమీ తెలియదు  కుటుంబంలో చాలా విషయాలు వదంతుల గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. బయట రూమర్లు మా వరకు వస్తున్నాయి. మేము ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే దాని గురించి చర్చించుకుంటాము. రెండు రోజుల క్రిందట పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం జరిగింది. దాని గురించి కూడా చర్చించుకున్నాం అంటూ చిరు కూతురు సుస్మిత చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: