తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా, కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్గా కనిపించబోతోంది. అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి లో జరుగుతుంది.

ఇక తదుపరి షెడ్యూల్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఆస్ట్రేలియాలో ఈ మూవీ కి సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కాపోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు యూఎస్ఏ కి వెకేషన్ కి వెళ్లారు. ఆయన మరికొన్ని రోజుల్లోనే వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కి రానున్నారు.

హైదరాబాద్ కు తిరిగి రాగానే దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ విడుదల గురించి మాట్లాడనున్నట్లు, ఆయన కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన లేదా డిసెంబర్ 20 తేదీన విడుదల చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను కనుక డిసెంబర్ 20 వ తేదీన పోటీ చేసినట్లు అయితే అల్లు అర్జున్ తో రామ్ చరణ్ కు గట్టి పోటీనే ఉంటుంది. ఎందుకు అంటే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప 2 మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది భారీ అంచనాల నెలకొని ఉన్న సినిమా కావడంతో మంచి టాక్ వచ్చినట్లు అయితే అవలీలగా నెల రోజులు థియేటర్లలో ఉంటుంది. దానితో పుష్ప , గేమ్ చేంజర్ కి గట్టి పోటీనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఉండే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: