స్టార్ హీరోల కథల సెలక్షన్లు చాలా బాగుంటాయి. ఎందుకు అంటే వారు కథలను ఎంచుకోవడంలో ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టే నటించిన చాలా సినిమాలతో ఎక్కువ శాతం మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తూ ఉంటారు. కానీ అలాంటి అభిరుచి ఉన్న నటులు కూడా కొన్ని సార్లు తప్పక అడుగు వేస్తూ ఉంటారు. వాటి ద్వారా వానికి అపజయాలు లభిస్తూ ఉంటాయి. ఇకపోతే కొంతమంది హీరోలు కథను ఓకే చేసినప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న తీరా సినిమా సెట్స్ పైకి వెళ్ళాక ఆ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఆ మూవీ ఆడడం కష్టమే అని వారికి కూడా అర్థం అవుతుంది. '

కానీ కమిట్ అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక చేసేదేమీ లేక ఆ మూవీ ని పూర్తి చేసి విడుదల చేస్తూ ఉంటారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో కూడా సూపర్ హిట్ అవుతాయి అని ముందు ఊహించి సినిమాను మొదలు పెట్టాక ఈ సినిమాలు ఆడటం కష్టమే అనిపించిన రెండు సినిమాలు ఉన్నాయట అవేంటో తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఆగడు, బ్రహ్మోత్సవం ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి.

ఇక ఆగడు మూవీ దర్శకుడు అయినటువంటి శ్రీను వైట్ల తో ముందే మహేష్ "దూకుడు" లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసి ఉండడం, అలాగే బ్రహ్మోత్సవం కంటే ముందు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేసి ఉండడంతో మహేష్ వీరిని చాలా బాగా నమ్మి ఈ సినిమాలను ఓకే చేశాడు. కానీ తీరా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ మూవీ లు ఆడడం కష్టమే అని మహేష్ కి అనిపించిందట. కానీ చేసేదేమీ లేక ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం, అది విడుదల కావడం, మహేష్ అనుకున్నదే జరగడం జరిగింది జరిగిందంట.

మరింత సమాచారం తెలుసుకోండి: