అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడుగా జరుగుతుంది. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరో 50 రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 50 రోజుల షూటింగ్ పూర్తి కాగానే అల్లు అర్జున్ ఫుల్ ఫ్రీ కాబోతున్నాడు. దీనితో ఇంతలో తన తదుపరి మూవీ ని ఫిక్స్ చేయాలి అని అల్లు అర్జున్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత అట్లీ దర్శకత్వంలో సినిమా చేయాలి అనుకున్నాడు. అందుకోసం ఆయనను వెళ్లి చెన్నై లో కలవడం, కథ చర్చలు కూడా జరగడం జరిగింది. దానితో విరి కాంబోలో ఆల్మోస్ట్ మూవీ సెట్ అయ్యింది అని కూడా వార్తలు వచ్చాయి. కానీ అనేక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయినట్లు అల్లు అర్జున్ వేరే దర్శకుడితో మూవీ చేయాలి అని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని ఇండియా లోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళితే ... శంకర్ ఇప్పటికే ఇండియన్ 2 మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడు. ఆ మూవీ జూలై 12 వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మరో రెండు, మూడు నెలల్లో కంప్లీట్ కానుంది. ఆ తర్వాత ఇండియన్ 3 ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో 8, 9 నెలల్లో శంకర్ ఆల్మోస్ట్ టోటల్ ఫ్రీ కాబోతున్నట్లు, దానితో వచ్చే సంవత్సరం అల్లు అర్జున్, శంకర్ కాంబోలో మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజంగానే ఈ కాంబోలో మూవీ సెట్ అయినట్లు అయితే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa