బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ  ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ పాటలు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. దీంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలో నెలకొన్నాయి. ఇకపోతే నార్త్ లో ప్రస్తుతం చేస్తున్న సినిమా లతో పాటు హృతిక్‌ - తారక్‌ వార్‌ 2కి కూడా

 కమిట్‌ అయ్యారు ఈ బ్యూటీ. ఇప్పుడు సౌత్‌లో గేమ్‌ చేంజర్‌, రాకీ భాయ్‌ యష్‌ టాక్సిక్‌లోనూ కియారా హీరోయిన్ల నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ డ్రెస్ లో మెరిసింది. దేవకన్య కనిపిస్తూ వైట్ డ్రెస్ లో మత్తెక్కించే కళ్ళతో కనబడుతోంది. దీంతో ప్రస్తుతం కీయార అద్వానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  హీరోగా కియారా అద్వానీ  హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే.

మరి శంకర్ ఎన్నో ఏళ్ళు నుంచి ఈ సినిమా తెరకెక్కిస్తూనే ఉన్నారు. దీనితో రిలీజ్ ఎప్పుడు అనేది చాలా సస్పెన్స్ గా నిలిచిపోగా దిల్ రాజు ఇచ్చిన కన్ఫర్మేషన్ వరకు అయితే ఈ సినిమా అక్టోబర్ ఎండింగ్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఇప్పుడు దీనితో పాటుగా సాలిడ్ బజ్ అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో వినిపిస్తుంది. ప్రస్తుతానికి దిల్ రాజు చెప్పినట్టుగా అక్టోబర్ 31 మొదటి డేట్ గా వినిపిస్తుండగా మరో డేట్ గా అయితే డిసెంబర్ 20 అన్నట్టుగా వినిపిస్తుంది. దీనితో ఈ రెండు తేదీల్లో అయితే గేమ్ ఛేంజర్ రావడం పక్కా అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: