IMDB - ఫోర్బ్స్ సంస్థలు తాజాగా హిందీ సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీమణులు ఎవరు అనే విషయంపై ఒక నివేదికను విడుదల చేసింది. అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీమణులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.

హిందీ సినీ పరిశ్రమలో దీపికా పదుకొనే అద్భుతమైన స్థాయిలో కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈమె చాలా సంవత్సరాల క్రితం కెరియర్ ను మొదలు పెట్టిన అనేక విజయాలను అందుకుంటు ఇప్పటికి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గానే కెరీర్ ను కొనసాగిస్తుంది. దానితో ఈమె హిందీ సినీ పరిశ్రమలో ఉన్న అందరు ముద్దుగుమ్మల కంటే కూడా ఎక్కువ పారితోషకాన్ని తీసుకుంటుంది. ఈమె ఒక్కో మూవీ కి 15 నుండి 30 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తాజాగా IMDB - ఫోర్బ్స్ సంస్థలు నివేదికను వెల్లడించాయి. ఇక ఈమె తర్వాత నటి మరియు పొలిటికల్ లీడర్ అయినటువంటి కంగనా రనౌత్ ఒక్కో మూవీ కి 15 నుండి 27 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు , ఈమె తర్వాత హిందీ హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ప్రియాంక చోప్రా 15 నుండి 25 కోట్లు ఒక్కో మూవీ కి తీసుకుంటున్నట్లు , ఆ తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కత్రినా కైఫ్ ఒక్కో మూవీ కి 15 నుండి 25 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు , ఆ తర్వాతి స్థానంలో ఆలియా భట్ ఒక్కో మూవీ కి 10 నుండి 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు , ఆ తర్వాత కరీనా కపూర్ 8 నుండి 18 కోట్లు , శ్రద్ధ కపూర్ 7 నుండి 15 కోట్లు , విద్యా బాలన్ 8 నుండి 14 కోట్లు , అనుష్క శర్మ 8 నుండి 12 కోట్లు , ఐశ్వర్యా రాయ్ 8 నుండి 10 కోట్లు తీసుకుంటూ ఉన్నారు అని తాజాగా ఈ సంస్థ నివేదికను విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: