తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవి కారణంగా ఎంతో మంది హీరోలు సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ పొజిషన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తం సినీ ఇండస్ట్రీని ఏలుతోంది. రాజకీయాల పరంగా కూడా చిరంజీవి గతంలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో వాటికి దూరమయ్యారు. ఇటీవలే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు అయిన తర్వాత మంత్రిగా ఇప్పుడు గెలవడం జరిగింది.


అయితే చిరంజీవి కుటుంబం నికి సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.తీవ్రమైన అనారోగ్య సమస్యతో శిరీష్ భరద్వాజ్ ఇటీవలి మృతి చెందారు.. ముఖ్యంగా లంగ్స్ డామేజ్ అవ్వడంతో హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో శిరీస్ మృతి చెందినట్లుగా సమాచారం .గతంలో చిరంజీవి కూతురు శ్రీజను వివాహం చేసుకున్నారు శిరీష్ భరద్వాజ్.. అయితే కొన్ని కారణాలవల్ల శిరీష్, శ్రీజ ఇద్దరు కూడా విడిపోవడం జరిగింది.


విడాకుల అనంతరం శ్రీజ మాజీ భర్త షిరీస్ కూడా మరొక వివాహం చేసుకున్నారు. శిరీష్ తీవ్రనారోగ్య సమస్య తో మృతి చెందినట్లుగా తెలుస్తోంది.ఈ సంఘటన పైన ఇంకా పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉన్నది.. శ్రీజ కూడా రెండవ వివాహం  కళ్యాణ్ దేవ్ తో వివాహం చేసినప్పటికీ అతని నుండి కూడా గత కొన్నేళ్లుగా దూరంగా ఉండడంతో విడాకుల బాట పట్టారనె వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి ఒక పాప కూడా ఉన్నది. కళ్యాణ్ దేవ్ హీరోగా కూడా ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అండ కూడా లేకపోవడం తో సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ పనులు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: