కుషిత కల్లపు ఈ పేరుకు పెద్ద పరిచయం అవసరం లేదు. ఈ పేరు కన్నా "బజ్జీల పాపా"గా ఈమె బాగా పాపులర్ అయ్యింది.ఈ మధ్య తరుచూ సోషల్ మీడియాలో కనిపిస్తూ బాగా హాడావుడి చేస్తోంది తెలుగు సోయగం కుషిత కల్లపు. చీరకట్టులో మన పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ పక్కా హైదరాబాదీ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అందులో ఒదిగిపోయి తన అందంతో ఎదుటి వారిని మెస్మరైజ్ చేస్తుంది.ఎక్కువగా చీరలోనే కనిపించే ఈ అచ్చ తెలుగు అందం అందులోనే రకరకాలుగా హోయలు పోతూ మగ పుంగవుల మతులు పొగొట్టడంలో పేరు తెచ్చుకుంది. పైగా కేవలం శారీలోనే కాదు మోడ్రన్‌ డ్రెస్సులలోనూ నేనేం తక్కువ కాదు అన్నచందాన అప్పుడప్పుడు తన మార్క్ డ్రెస్సింగ్‌తో కవ్విస్తూ ఉంటుంది.అయితే.. అప్పటివరకు మోడల్‌గా అంతంత మాత్రంగానే పేరున్న కుషిత కు ఏ ముహుర్తానా హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటకు వచ్చిందో కానీ అదే ఆమె పాలిట కల్పవృక్షంగా మారి బాగా పాపులర్‌ను చేసింది.

ముఖ్యంగా కేసు విషయంలో నేను డ్రగ్స్ తీసుకోలేదు.. చీజ్ బజ్జీలు తినడం కోసమే పబ్‌కు వెళ్లానంటు చెప్పిన మాటలతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ మారడమే కాక, ట్రోలర్స్ చేతిలో ఓ రేంజ్‌లో రోస్ట్ అయింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది.ఈ క్రమంలో అదే సమయంలో ఈ భామ తనకు వచ్చిన ఫేమ్‌ను చే జార్చుకోకుండా తన పేరు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో రెగ్యులర్‌గా ఉండేలా, కనిపించేలా చూసుకుంటుంది. అంతేకాదు అదే ఊపులో రెండు మూడు సినిమాల్లో కథానాయికగా కూడా చేసింది. గత సంవత్సరం ఛాంగురే బంగారు రాజా, నీతేనే నేను సినిమాల్లో నటించిన ఈ చిన్నది ఈ సంవత్సరం బాబు నెంబర్‌వన్ బుల్షిట్ గాయ్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం మనోహరం అనే మూవీలో కథానాయికగా చేస్తోంది.ప్రస్తుతం చేతిలో సినిమాలు అంతంతమాత్రంగానే ఉండడంతో కుషిత  సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటు అన్ని ఫ్లాట్ ఫాంలతో కలిపి మిలియన్ వరకు ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీంతో సమయం దొరికినప్పుడల్లా రోజుకో స్టైల్‌లో తన అందచందాలతో హోయలు ఒలికిస్తూ నిత్యం వీడియోలతో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రోజుకు కనీసం ఒకటి , రెండు వీడియోలను, ఫోటోలను ఇన్ స్టా, ఎక్స్‌లలో పోస్టు చేస్తూ తన ఫాలోవర్స్‌ను, అభిమానులను అలరిస్తోంది. మున్ముందైనా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు పెరుగుతాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: