మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఊహించని పరిణామం ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు ఇవాళ మరణించారు. చిరంజీవి కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ చనిపోయారు. గత కొన్ని రోజులుగా... ఊపిరితిత్తుల సమస్యతో శ్రీజా మాజీ భర్త శిరీష్ బాధపడుతున్నారు. అయితే ఊపిరితిత్తుల సమస్య తీవ్రతరం కావడంతో ఇవాళ హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ మరణించినట్లు సమాచారం అందుతుంది.

 39 సంవత్సరాలు ఉన్న శిరీష్.. మొదట చిరంజీవి కూతురు శ్రీజాను పెళ్లి చేసుకొని... ఆమెకు విడాకులు ఇచ్చి  మరో వివాహం చేసుకున్నాడు. 2007 సంవత్సరంలో శిరీష్ భరద్వాజ్, మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ  ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకు ఎవరికీ చెప్పకుండా ఆర్య సమాజంలో వీరిద్దరి వివాహం అప్పట్లో జరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వీరివివాహం హాట్ టాపిక్ అయింది.

అయితే... 2007 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2011 సంవత్సరంలోనే విడిపోయారు. అదనపు కట్నము, ఇంట్లో టార్చర్ భరించలేక..  శిరీష్ భరద్వాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీజ. అప్పటికే వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కారణంగా శిరీష్ భరద్వాజ్... చాలా ఇబ్బందులు పడ్డట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత  హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ విహాన ను పెళ్లి చేసుకున్నాడు శిరీష్.

 అటు శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్  ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా శిరీష్ భరద్వాజ్ మరణించడం...జరిగింది. ఇక ఈ సంఘటనపై నటి శ్రీరెడ్డి వివాదాస్పద పోస్ట్ పెట్టింది. చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇక లేడు.. ఇప్పటికైనా నీకు శాంతి దొరికింది రా శిరీష్ అంటూ... పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. అందరూ నిన్ను మోసం చేశారని... చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశిస్తూ... శ్రీ రెడ్డి మండిపడింది. గతంలో.. చిరంజీవి కుటుంబం కారణంగా... శిరీష్ భరద్వాజ్ అనేక ఇబ్బందులు పడ్డాడని... గుర్తు చేస్తూ శ్రీరెడ్డి ఈ పోస్ట్ పెట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: