తెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటులలో నితిన్ ఒకరు. ఈయన పోయిన సంవత్సరం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. అంతకు ముందు కూడా ఈయన నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా వరుసగా అపజయాలను అందుకుంటున్న ఈ నటుడు ప్రస్తుతం రెండు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ నటుడు ప్రస్తుతం వెంకి కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే సినిమాలోనూ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు.

ఈ రెండు మూవీలు కూడా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీలే కావడం విశేషం. ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్న నితిన్ ఈ రెండు మూవీల ద్వారా కాస్త సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అనుకుంటున్నారా..? అదేమీ లేదు. ఈ సినిమా విడుదల తేదీలకు సంబంధించి నితిన్ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న రాబిన్ హోట్ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమ్ముడు మూవీ ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలి అని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీనితో రాబిన్ హుడ్ సినిమాను కనుక డిసెంబర్ ఎండింగ్లో విడుదల చేసి తమ్ముడు సినిమాలో ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసినట్లు అయితే ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ కేవలం ఒక నెల మాత్రమే ఉంటుంది. దాని వల్ల ఒక సినిమా సక్సెస్ అయితే ఏమీ కాదు కానీ ఫెయిల్ అయినట్లు అయితే దాని ప్రభావం మరో సినిమా మీద పడే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఈ మూవీ మేకర్స్ ఇద్దరు కూడా రాబిన్ హుడ్, తమ్ముడు మూవీల మధ్య గ్యాప్ కాస్త ఎక్కువ ఉండే విధంగా చూసుకుంటున్నట్లు, అందులో భాగంగా రాబిన్ హుడ్ మూవీని డిసెంబర్ కంటే కాస్త ముందుగానే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: