టాలీవుడ్ యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా కెరీర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీతో ఈ నటుడు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి మాత్రం ఈ నటుడు వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లిపోయాడు. ఏకంగా 2022 సంవత్సరంలోనే ఈయన నటించిన సెబాస్టియన్ , నేను మీకు బాగా కావలసిన వాడిని , సమ్మతమే సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.

ఇందులో సమ్మతమే మూవీ కాస్త పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2023 వ సంవత్సరం ఈ నటుడు వినరో భాగ్యము విష్ణు కథ , మీటర్ , రూల్స్ రంజన్ అనే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కాస్త మంచి విజయాన్ని అందుకోగా మిగిలిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే 2022,  2023 సంవత్సరాల లో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటుడు ఈ మధ్య సినిమాల పరంగా కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఆఖరుగా రూల్స్ రంజన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.

ఆ తర్వాత నుండి ఈయన సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈయన ప్రస్తుతం ఒక పిరియాడిక్ మూవీలో హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సంవత్సరంలోనే ఈ సినిమాను విడుదల చేయాలి అని మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మరి ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించిన ఈ నటుడు కొన్ని మూవీలతోనే మంచి విజయాలను అందుకున్నాడు. ఇక కిరణ్ పిరియాడిక్ మూవీతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. కిరణ్ ప్రస్తుతం నటిస్తున్న పిరియాడిక్ మూవీకి సంబంధించిన వివరాలను మేకర్స్ మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kb