బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభించబోతోంది. అంతేకాదు దీనికోసం ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్లను కూడా తీసుకున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ప్రముఖ యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని బిగ్ బాస్ లోకి తీసుకురావాలి అని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లుగా

 తెలుస్తోంది. అంతేకాదు కొందరి పేర్లు చాలావరకు సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే చాలామందితో ఈ విషయం పై చర్చలు కూడా జరిపినట్లు గా తెలుస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఇందులో కుమారి ఆంటీ కూడా ఉంది అన్న సమాచారం వినబడుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టడం ఎక్కువైంది. అటుగా వెళుతున్న వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె బిజినెస్ క్లోజ్ అయింది. అయితే సీఎం

 రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ హోటల్ ను ఓపెన్ చేయించారు. దీంతో కుమారీ ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేసింది. ఇదే అదనుగా కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఆమెను సెలబ్రిగా మార్చాయి. ఇక ఈక్రమంలోనే కుమారీ ఆంటీ బిగ్ బాస్ సీజన్‌8లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అనే న్యూస్ వస్తోంది. మొత్తానికి అయితే బంపర్ ఆఫర్ కొట్టేసింది కుమారి ఆంటీ అలా ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: