టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అనుష్క ఇప్పుడు ఒక్క సినిమా కూడా చేయడం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత పలు సినిమాలు చాలా యాక్టివ్ గా చేసింది. బాహుబలి 1 బాహుబలి 2 సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆ తర్వాత నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా మిగిలింది. కాగా ఆ సినిమాల తరువాత గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాహుబలి సినిమాలో చాలా

 అందంగా స్లిమ్ గా ఉన్న అనుష్క బాహుబలి 2 తర్వాత కాస్త లావు అయింది. ఆ తర్వాత చేసిన పలు సినిమాల్లో చాలా లావుగా కనిపించింది అనుష్క. అందుకే సినిమాలకి బ్రేక్ ఇచ్చింది అని చాలామంది అన్నారు. కానీ అనుష్క మాత్రం స్వయంగా ఈ విషయంపై ఎప్పుడు స్పందించలేదు. ఆ మధ్యకాలంలో చాలా లావుగా ఉన్న అనుష్క పెద్ద ఎత్తున ట్రోలింగ్ బారిన పడింది. ఆ తర్వాత ఇటీవల వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో కాస్త స్లిమ్ముగా కనిపించింది. తన అందం నటనతో అందరినీ మళ్లీ ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిట్ అయింది అనుష్క శెట్టి. అలాగే మలయాళీలో ఓ పాన్ ఇండియా చిత్రంలో కూడా చేస్తోంది. ఈ రెండు కాకుండా కొన్ని కథలు డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నట్లు టాక్. ఇదిలా ఉంటే అనుష్క శెట్టి 

 సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు. స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫొటోస్, అప్డేట్స్ అప్లోడ్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. విపరీతంగా ఫాలోవర్స్ ని పెంచుకుంటారు. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో ఓ లుక్ పిక్చర్ షేర్ చేసింది. దేవసేన తరహాలో ఉన్న పిక్ ని సడెన్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. బహుశా ఈ లుక్ తన కొత్త సినిమాలోనిదా లేదంటే బాహుబలి, సైరా సినిమాలకు సంబంధించిదా అనే డౌట్స్ వస్తున్నాయి. ఏదేమైనా అనుష్క అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకునేందుకు ఇలా సడన్ ట్విస్ట్ ఇస్తోంది. మొత్తానికి అనుష్క లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: