ప్రెసెంట్ ఉన్న సెలబ్రిటీలంతా అనేక కేసుల్లో బుక్ అయ్యి తమ కెరీర్ ని నాశనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ మరియు మద్యం కేసుల్లో దొరికిపోయి ఇప్పటికే ఎంతోమంది పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నారు. ఇక తాజాగా మద్యం కేసులో మరో సింగర్ అరెస్ట్ అయ్యాడు. అమెరికన్ సింగర్ అండ్ గ్రామీ అవార్డు విజేత టింబర్ లేక్ అరెస్ట్ అయ్యాడు. తప్ప తాగి మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో న్యూయార్క్ ఐలాండ్ లోని సాగ్  హార్బర్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇక ప్రస్తుతం ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం. కాగా 2002లో సోలో రికార్డింగ్ సింగర్ కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈయన తన టాలెంట్ తో గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ప్రస్తుతం ఫర్గెట్ టుమారో పేరుతో గ్లోబుల్ టూర్ లో ఉన్నాడు. మార్చిలో స్టార్ట్ అయినా కొత్త ఆల్బమ్ ఎవ్రీథింగ్ ఐ థాట్ ఇట్ వాస్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక వచ్చే వారంలో చికాగో అండ్ న్యూయార్క్ లోని కొన్ని ఈవెంట్స్ చేయనున్నాడు. అంతేకాకుండా తరువాత యూరప్ లో ఈ నెలాఖరులో కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

కానీ ఈలోపే ఈ సంఘటన జరగడంతో అభిమానులు నిరాశకి గురయ్యారు. తాగుతూ రోడ్లపై రాష్ గా డ్రైవ్ చేస్తూ వెళ్లడంతో పోలీసులు ఈనని అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రజెంట్ ఉన్న సిచువేషన్ చూస్తే బయటికి రావడం కష్టమే అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మొత్తానికి అయితే ఇప్పటివరకు ఎంతో మంచి పేరుతో ఉన్న ఈయ‌న పేరు ఒకే ఒక రాత్రి తో మొత్తం పోయింది. ఇక ఈ విషయం పై తన కుటుంబ సభ్యులు ఏ విధంగా కూడా స్పందించలేదు. మరి పోలీసుల కస్టర్డ్ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఈ సింగర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: