తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు నెలలుగా సాలిడ్ హీట్ రాలేదు. ఆఖరుగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి సాలిడ్ విజయం దక్కింది. ఈ మూవీ మార్చి 29 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా తర్వాత ఏప్రిల్ , మే నెలలో అనేక తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఏ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఇప్పటికే జూన్ నెల కూడా సగం కంటే ఎక్కువ పూర్తి అయింది. ఈ నెలలో కూడా మంచి విజయవంతమైన సినిమా తెలుగులో ఇప్పటివరకు రాలేదు.

ఇలా మన తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోవడం కోసం సతమతం అవుతుంటే తమిళ సినిమాలు మాత్రం మన దగ్గర మంచి విజయాలను సాధిస్తున్నాయి. అందులో భాగంగా కొంత కాలం క్రితం తమన్నా , రాశి కన్నా ప్రధాన పాత్రలో సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన "అరన్మనై 4" అనే తమిళ సినిమా బాక్ అనే పేరుతో తెలుగు లో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇక కొన్ని రోజుల క్రితమే తమిళ నటుడి విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన మహారాజా అనే మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది.

మూవీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ దక్కింది. దానితో ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఇంకా ఈ సినిమా చాలా రోజులు సాలిడ్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టే అవకాశాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మన తెలుగు సినిమాలు విజయాలను అందుకోవడానికి గత రెండు నెలలుగా అనేక కష్టాలు పడుతూ ఉంటే తమిళ సినిమాలు మాత్రం మన దగ్గర మంచి విజయాలను సాధించుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: