రామ్ చరణ్, ఉపాసన దంపతులు చాలా జాగ్రత్తలు తీసుకొని క్లీంకార మొహం కనపడకుండా, చూపించకుండా ఇన్నిరోజులు వచ్చారు. కానీ ఇటలీలో కొణిదెల, కామినేని కుటుంబాల గ్రూప్ ఫోటో ఒకటి బయటకి వచ్చింది. అందులో క్లీంకార మొహం చాలా క్లియర్ గా వుంది. అదెలా జరిగింది అంటే...టాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ రామ్ చరణ్ , ఉపాసన కామినేని లకి జూన్ 20న కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్సెస్ అని ముద్దుగా పిలుచుకునే ఆమెకి క్లీంకార కొణిదెల అని పేరు కూడా పెట్టారు. అయితే పుట్టిన దగ్గర నుండి ఆమె ఫేస్ ను ఎక్కడా చూపించకుండా చాలా జాగ్రత్తపడ్డారు. ఆ అమ్మాయికి బాలసారె చేసినప్పుడు కానీ, ఉయ్యాలలో వేసినప్పుడు, తాతయ్య చిరంజీవి ఇంటికి ఆమెని తీసుకు వచ్చినప్పుడు ఆమె మొహం కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు.అలాగే రామ్ చరణ్, ఉపాసన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆమె మొహం కనపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ ఆమెతో వున్న ఫోటోలను మీడియాకి పంపినప్పుడు కూడా క్లీంకార మొహం మీద ఒక లవ్ సింబల్ వేసేసేవారు మొహం కనపడకుండా. అంతటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ దంపతులు.
ఎ ట్టకేలకు మెగా మనవరాలు.. రామ్ చరణ్ - ఉపాసన గారాల కూతురు క్లింకార ఫేస్ ను రివిల్ చేశారు. అప్పుడే బుడి బుడి అడుగులు వేస్తూ సందడి చేస్తోంది క్లింకార.మెగాఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. చిరంజీవి మనవరాలు.. రామ్ చరణ్ ఉపాసనల గారాల కూతురు క్లింకార ఫేస్ ను ఎప్పుడు చూపిస్తారంటూ..అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. పుట్టినప్పటి నుంచి ఆమెఫేస్ కనపించకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు ప్యామిలీ. కాని తాజాగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు రామ్ చరణ్.మెగా ఫ్యామిలీ లక్కీ లెగ్.. రామ్ చరణ్ గారాల కూతురు క్లింకార అప్పుడే నడిచేస్తోంది. చిన్నారి పాదాలతో బుడి బుడి అడుగులు వేస్తోంది. తల్లీ తండ్రి చేయి పట్టుకుని క్లింకార అడుగులు వేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు మెగాపవర్ స్టార్..


గ్లోబల్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన. అంతే కాదు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా క్లింకార ఫేస్ ను రివిల్ చేశారు మెగా ఫ్యామిలీ. ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదరు చూస్తున్న తరుణం రానే వచ్చింది.క్లింకార పుట్టిన దగ్గరనుంచి ఇంత వరకూ ఆమె ముఖం చూపించలేదు మెగా ఫ్యామిలీ. సీక్రేట్ గా మెయింటేన్ చేస్తూ వస్తున్నారు. ఫోటోలలో కూడా ముఖానికి ఎమెజీలు పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాంతో ప్యాన్స్ ఎప్పుడెప్పుడు క్లింకార ను చూపిస్తారా అంటూ ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా క్లింకార ఫేస్ ను రివిల్ చేశారు చరణ్. అయితే ఇందులో కూడా పూర్తిగా కాకుండా.. ఒక వైపు మాత్రమే కనిపించేలా ఫోటో పెట్టారు.ఇక క్లింకార పుట్టిన తరువాత మెగా ప్యామిలీకి బాగా కలిసొస్తోంది. చరణ్ కు హాలీవుడ్ రేంజ్ లో ఇమేజ్ రావడం. చిరంజీవికి పద్మవిభూషన్ రావడం.. వరుణ్ తేజ్ పెళ్ళి. పవన్ కళ్యాణ్ భారీ విజయం.. ఇలా చాలా రకాలుగా వాళ్ళకు కలిసొచ్చిందని నమ్ముతున్నారు. మెగా ఇంట సిరుల పంట పండిస్తున్న క్లింకారను అందరు ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు.ఇక రామ్ చరణ్.. ఉపాసన పెళ్ళి చేసుకున్న 12 ఏళ్లకు క్లింకార పుట్టింది. అప్పటి వరకూ ఎన్ని విమర్షలు వస్తున్నా పట్టించుకోకుండా ఓపికగా తమ లైఫ్ ను సెట్ చేసుకున్నారు చరణ్ ఉపాసన. అనుకున్నటైమ్ కు పిల్లలను ప్లాన్ చేసుకున్నారు జంట. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: