త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక అంతటి భారీ విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తాడు అన్నదానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే దేవర రెండు పార్ట్ లుగా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇదివరకే దీనికి సంబంధించిన అఫీషియల్

 అనౌన్స్మెంట్ ఇచ్చారు .అయితే పార్ట్ వన్ పూర్తయిన వెంటనే పార్ట్ టు ఉంటుందా లేదా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి. ఉంది ఇదిలా ఉంటే దేవర సినిమా అయిపోయిన వెంటనే అటు బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. వార్ టు సినిమా తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఫారన్ షెడ్యూల్ సైతం పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ లకి సంబంధించిన పలు ముఖ్యమైన సన్నివేశాలు సైతం షూట్ చేశారట. ఇందులో భాగంగానే నెక్స్ట్ షెడ్యూల్ చాలా పక్కాగా ప్లాన్

 చేస్తున్నారట డైరెక్టర్స్ అదేంటంటే. ఇద్దరు హీరోల డేట్స్ ఒకేసారి దొరికే పరిస్థితి లేనప్పుడు మాత్రం టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఏ హీరో డేట్స్ దొరికినప్పుడు వాళ్ల సీన్స్‌ను షూట్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాంబినేషన్‌ సీన్స్‌, యాక్షన్ ఎపిసోడ్స్‌ కోసం ఇద్దరు హీరోలకు బాడీ డబుల్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ముందు డూప్‌లతో షూటింగ్‌ చేసేసి తరువాత ఫేస్‌ స్వాపింగ్‌ టెక్నాలజీ ద్వారా ఆ ప్లేస్‌లో హీరోలను చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా లో ఈ టెక్నాలజీ వాడినా... పూర్తి స్థాయిలో ఇదే టెక్నాలజీ మీద డిపెండ్‌ కాలేదు. కానీ వార్ 2 విషయంలో పూర్తి స్థాయిలో ఈ టెక్నాలజీ వాడుతున్నారట మేకర్స్‌. దీంతో ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: