తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాకు చేస్తూ బిజీగా ఉన్నారు ఈ నటుడు. తమిళంలో హీరోగా పలు సినిమాలు చేసి భారీ గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఉప్పెన సినిమాతో తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఉప్పెన లో విలన్ పాత్రలో అదరగొట్టేసారు విజయ్ సేతుపతి. ఇక అప్పటినుండి ఆయనకి తెలుగులో చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించే అవకాశం దక్కింది. అలా తెలుగులో కేవలం హీరో గానే కాకుండా విలన్

 పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేసిన సినిమా మహారాజా. ఇక ఇటీవల తెలుగులో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇందులో భాగంగానే మహారాజా సినిమా సక్సెస్ అవడంతో ఆయన పేరు సౌత్ ఇన్ ఇండస్ట్రీలో తెగ వినబడుతోంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు ఆయన. అందులో భాగంగానే ఆయన జూనియర్ ఎన్టీఆర్ పై పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. విజయ్ సేతుపతి తారక్ యాక్టింగ్ స్కిల్స్ గురించి

 ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని విజయ్ సేతుపతి అన్నారు. మహారాజ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ సేతుపతి ఈ కామెంట్లు చేశారు. తన ఫేవరెట్ హీరో, సౌత్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అని తారక్ అంటే నాకు చాలా అభిమానమని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఒక సినిమాను కచ్చితంగా ఆశించవచ్చని కామెంట్లు వ్యక్తమయ్యాయి. మరి రాబోయే రోజుల్లో అయినా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అన్నది చూడాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: