గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ సినిమా ఈనెల 27న విడుదలై ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు  తారా స్థాయికి చేరుకున్నాయి. అందులో భాగంగానే చిత్ర బృందం రోజుకొక అప్డేట్ విడుదల చేస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ కి ఆశలు పెంచేస్తున్నారు. కేవలం మరొక ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ

 సినిమాతో ప్రభాస్ మరొకసారి బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థమవుతుంది. ఇకపోతే ఇందులో  ప్రభాస్ ఎలా కనిపిస్తాడు తన యాక్టింగ్ ఎలా ఉండబోతోంది అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందులో భాగంగానే ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ చూస్తే ప్రభాస్ ఇందులో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాన్ని కూడా శరవేగంగా జరుపుతున్నారు చిత్ర బృందం. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలోని మరియమ్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది చిత్ర

 బృందం. మరియమ్ అనే పాత్రలో ప్రముఖ నటి శోభన నటిస్తున్నట్లుగా తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది వైజయంతి మూవీస్. సోషల్ మీడియా ఖాతా ద్వారా వైజయంతి మూవీస్ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు ' ఆమె లాగే తన పూర్వీకులు కూడా ఎదురు చూశారు ' అంటూ క్యాప్షన్ ను జత చేశారు. దింతో ఆమె పాత్రపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. ఇక కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ లో స్టెంట్స్ చేసాడు.. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని, మృణాల్ ఠాకూర్ తదితరులు సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: