హీరో శ్రీరామ్ తమిళ సినిమా ‘రోజా కూటం’తో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాను ‘రోజా పూలు’గా తెలుగులోకి అనువాదం చేశారు. భూమిక హీరోయిన్ కావడంతో ఈ సినిమా తెలుగువారికి బాగా రీచ్ అయ్యింది. అయితే, సినిమా చూశాక అందరూ హీరో శ్రీరామ్ గురించి మాట్లాడుకున్నారు. తెలుగబ్బాయే అంట కదా అని ఆరాలు తీశారు. ఆ తర్వాత ‘ఒకరికి ఒకరు’ అనే సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేశారు శ్రీరామ్. ఈ సినిమా అప్పట్లో మంచి మ్యూజికల్ హిట్.ప్రస్తుతం అవకాశాలు లేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు శ్రీరామ్. ప్రస్తుతం శ్రీరామ్ చేసిన కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. అవేమిటంటే త్రిష నా పెళ్లి చెడగొట్టింది. నా గురించి ఉన్నవి లేనివి చెప్పింది అంటూ ఆరోపణలు చేస్తున్నాడు సౌత్ స్టార్ హీరో శ్రీరామ్.దాదాపుగా 25 ఏళ్లకు పైగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది త్రిష.ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో దూసకుపోతున్న త్రిష.. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోకుండా బ్యాచలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. అయితే తాను పెళ్ళి చేసకోండా.. ఇతర ఆర్టిస్ట్ ల పెళ్ళిళ్లు చెడగొడుతుందట చెన్నై చిన్నది. తాజాగా ఓహీరో.. తన పెళ్ళిని త్రిష చెడగొట్టిందంటూ సంచలన నిజాలు వెల్లడించాడు ఇంతకీ ఎవరా హీరో.తమిళ, తెలుగు సినిమాల్లో సందడి చేసిన హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ గుర్తుండే ఉంటుంది. ఈ హీరో ఓ ఈవెంట్‌లో త్రిష గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. త్రిషతో తను అన్ని విషయాలు షేర్ చేసుకుంటునాని, అదే విధంగా తన భార్య వందనకు లవ్ ప్రపోజ్ చేసిన విషయం కూడా చెప్పాడట. అయితే త్రిష, వందన దగ్గరకు వెళ్లి తన గురించి బ్యాడ్‌గా చెప్పిందట.

 శ్రీరామ్ కు చదువులేదు, మంచోడు కాదు, ఇంగ్లీష్ రాదు… ఇలా తన గురించి ఉన్నవి లేనివి చెప్పిందట త్రిష. అయితే ఈ విషయాన్ని తాను ప్రేమించి వందన వచ్చి శ్రీరామ్ తో చెప్పడంతో షాక్ అయ్యాడట. ఇలా ఎందుకు చెప్పావంటూ త్రిషనే అడిగాడట శ్రీరామ్. దాంతో త్రిష వందన నా ఫ్రెండ్.. నీలాంటి వాడికి ఎలారా ఇచ్చేది తనను అంటు గట్టిగా నవ్విందట. అప్పుడు తనకు అర్ధం అయ్యింది... అది ప్రాంక్ అని.ఇక త్రిష ఇండస్ట్రీలో చాలా మందికి క్లోజ్. తన తోటి నటీనటులుతో మంచి సాన్నిహిత్యం మేయింటేన్ చేస్తుంటుంది. అలా టాలీవుడ్ హీరో శ్రీరామ్‌తో కూడా మంచి ఫ్రెండ్‌షిప్‌ను మేయింటేన్ చేస్తుంటుంది. శ్రీరామ్, త్రిష కాంబినేషన్‌లో తొలిసారి 'మనేసెళ్లమ్' అనే సినిమా వచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా వళ్ల వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.ఇక అలా త్రిష తన పెల్లి చెడగొట్టాలని చూసిందంటూ శ్రీరామ్ వెల్లడించారు. శ్రీరామ్ 2008లో వందనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక హీరోగా ఎంటర్ అయిన శ్రీరామ్.. కొన్నాళ్ళు వరుస సినిమాలు చేశాడు. తరువాత కెరీర్ డౌన్ అవ్వడంతో.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు.అటు త్రిష మాత్రం ప్రస్తుతం దూకుడు మీద ఉంది. వరుసగా తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో అజిత్, విజయ్ సినిమాల్లో చేస్తున్న చెన్నై చిన్నది.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: