తెలుగు సినిమాలలో విభిన్నమైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు హీరో అశ్విన్ బాబు.. తన కెరియర్ లో రాజు గారి గది, హిడింబా తదితర చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తాజాగా ఇప్పుడు శివం భజే అంటూ మరొక సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో హీరోయిన్గా దిగంగాన సూర్యవంశి నటిస్తున్నది. డైరెక్టర్ అప్సర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్స్ పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


తాజాగా ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ చూస్తే సినిమా అంచనాలు భారీగానే పెంచేస్తోంది. ఈ సినిమా సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్, ఎలివేన్స్ తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న సినిమాగా కనిపిస్తోంది. టీజర్ విజయానికి వస్తే హీరో అశ్విన్ కి ఏదో ఒక మానసిక సమస్య ఉన్నట్లు ఇందులో చూపించారు. అలాగే బ్రహ్మాజీ, హైపర్ ఆది చెప్పడం ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగమవుతారు. ఇందులో కీలకమైన పాత్రలో బాలీవుడ్ నటుడు ఆర్భాజ్ ఖాన్ కూడా నటించారు. మరొక అశ్విన్ బాబు కూడా ఎప్పుడు విభిన్నమైన కథలతోనే ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.


అందుకు తగ్గట్టుగానే ఈసారి శివుడి కాన్సెప్ట్ తో శివం భజే అనే సినిమాని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తూ ఉంటే కచ్చితంగా అందరికీ గుస్ భమ్స్  వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కూడా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ టీజర్ మటుకు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అశ్విన్ బాబు మరొకసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: