ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి. డార్లింగ్ ప్రభాస్ దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ నేపథ్యంలో రాబోతోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల కి కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంది. దీంతో ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు చిత్ర బృందం. ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచిన చిత్ర బృందం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అప్డేట్ బయట పెడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు.

 దాంతో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఈవెంట్ కి సినిమాలోని కీలకపాత్రలో కనిపించబోయే ప్రముఖులు అందరూ వచ్చారు. ఇందులో భాగంగానే అమితాబచ్చన్ ఈ సినిమ గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందులో భాగంగానే డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో ఆయన చేసిన పలు కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. బిగ్ బి మాట్లాడుతూ.... విజువల్స్ వండర్ ను క్రియేట్ చేశారు.. సినిమా ఇంత

 బాగా రావడానికి కారణం డైరెక్టర్ అంటూ అతని పై ప్రశంసలు కురిపించారు.. ఈ క్రమంలో విజువల్స్ అంటూ స్టోరీని లీక్ చేసాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు..ప్రస్తుతం అమితాబ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక మొన్న రిలీజ్ చేసిన సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అలాగే అమెరికాలో మరో రికార్డును బద్దలు కొట్టింది.. ఉత్తర అమెరికాలో $2 మిలియన్ ప్రీ సేల్స్ వసూలు చేసిన భారతీయ చిత్రంగా కల్కి నిలవడం విశేషం.. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ కు ముందే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: