విజయ్ సేతుపతి తాజాగా మహారాజా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఏ మూవీ ని జూన్ 14 వ తేదీన మహారాజా అనే టైటిల్ తోనే తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీ విడుదల కంటే ముందు ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ సేతుపతి తమిళ్ లో ఏ స్థాయిలో అయితే ప్రమోషన్లను చేశాడో తెలుగు లో అదే స్థాయిలో ప్రచారాలను నిర్వహించాడు. దానితోనే ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉండి ఉంటుంది అందుకే విజయ్ సేతుపతి ఇంతలా ప్రమోషన్లను చేస్తున్నాడు అని అంతా భావించారు.

ఇక ఈ సినిమా విజయ్ సేతుపతి కెరియర్ లో 50 వ మూవీ గా రూపొందింది. దానితో విజయ్ తన కెరియర్ లో 50 వ మూవీ గా ఈ సినిమాను ఎంచుకున్నాడు అంటే ఇందులో కచ్చితంగా గట్టి మ్యాటర్ ఉండి ఉంటుంది అని కూడా జనాలు భావించారు. ఇలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో మొదటి రోజుతో పోలిస్తే ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 2 వ రోజు , 3 వ రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రస్తుతం కూడా ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా జోరు ఫుల్ గా కొనసాగుతూ ఉండటంతో మరో వారం , పది రోజులు ఈ సినిమాకు ఇదే స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో ఈ సినిమాకు మరో వారం , పది రోజులు కలెక్షన్లు వచ్చినట్లు అయితే ఈ సినిమా అవలీలగా 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడం మాత్రమే కాకుండా అంతకుమించిన కలెక్షన్లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి మహారాజా మూవీ ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs