యాంకర్ గా కొనసాగుతూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నవదీప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు ఈయన. అయితే తాజాగా ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నవదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లవ్ మౌళి. ఆ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్న నవదీప్ అప్పుడప్పుడు విలన్ పాత్రల్లో కనిపించడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఆయన లవ్ మౌళి అనే సినిమాతో లవర్ బాయ్ గా కనిపించాడు.

ఇక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలైన కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇక అసలు విషయం లోకి వెళితే.. అవనీంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నవదీప్ హీరోగా నటించిన చాలా కాలం తర్వాత హీరోగా నటించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. భారీ అంచనాల నడుమ జూన్ 7న విడుదలైన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అవ్వలేకపోయింది.

 సినిమా చూసినవారంతా నవదీప్ కొత్తగా కనిపించాడు, లుక్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది అని పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ ఎక్కువమందికి మాత్రం ఈ మూవీ రీచ్ అవ్వలేకపోయింది. దీంతో రెండు వారాల్లోని ‘లవ్ మౌళి’కి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఎక్స్క్లూజివ్ తెలుగు ఓటీటీ యాప్ అయిన ఆహాలో ‘లవ్ మౌళి’ విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘తను ప్రేమ గురించి మిమ్మల్ని గట్టిగా ఆలోచించేలా చేస్తాడు. త్వరలోనే ఆహాలో లవ్ మౌళి జర్నీని ఎక్స్పీరియన్స్ చేయండి’ అంటూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై క్లారిటీ ఇచ్చింది ఆహా. కానీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే విషయం మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: