విజయ్ సేతుపతి తాజాగా మహారాజా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఎల్ని జూన్ 14 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి రిలీజ్ అయిన మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. దానితో ఈ మూవీ ఇప్పటికే 50 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. మరి ముఖ్యంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో విజయ్ సేతుపతి తాజాగా ఓ ఈవెంట్ ను తెలుగులో నిర్వహించాడు.

దానికి ఉప్పెన సినిమా దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సనా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇకపోతే గతంలోనే బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా విజయ్ కి తెలుగులో అద్భుతమైన గుర్తింపు లభించింది. బుచ్చిబాబు తన తదుపరి మూవీని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక తాజా ఈవెంట్ లో భాగంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ... బుచ్చిబాబు గ్రేట్ డైరెక్టర్ అలాగే మంచి వ్యక్తి. ఆయన తన నెక్స్ట్ మూవీ ని రామ్ చరణ్ తో చేయబోతున్నాడు.

మూవీ కథ మొత్తం నాకు తెలుసు. అది ఒక అద్భుతమైన కథ. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా బుచ్చిబాబు, చరణ్ తో చేయబోయే సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ను విజయ్ సేతుపతి ఇచ్చాడు. ఇకపోతే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈయన కూడా బుచ్చిబాబు, చరణ్ తో చేయబోయే కథ ఒక అద్భుతమైనది అది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పాడు. ఇలా ఎంతో మంది ఈ సినిమా కథ గురించి ప్రశంసలు కురిపిస్తూ ఉండడంతో ఈ మూవీ మొదలు కాకముందే ఈ సినిమాపై జనాల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs