త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఈ సినిమా తర్వాత ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇకపోతే   రామ్ చరణ్  భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ల కంటే ఎక్కువ

 గుర్తింపు తెచ్చుకున్న ఈమె సినిమాలు ఏవి చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకి సంబంధించిన అప్డేట్స్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లీన్ కార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇవాళ మెగా వారసురాలు మొదటి పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు అందరూ తనకి మొదటి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ సందర్భంగా తన కూతురికి సంబంధించిన ఒక

 ఎమోషనల్ వీడియో షేర్ చేసింది ఉపాసన. 'నా ప్రియమైన క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మా జీవితాల్లో ఆనందం నింపినందుకు ధన్యవాదాలు' అంటూ విషెస్‌ చెప్పారు. ఇక తాను షేర్‌ చేసిన వీడియోను ఇప్పటికి మిలియన్‌ సార్లు చూసినట్లు తెలిపారు. ఆ వీడియోలో చరణ్‌  ఉపాసనలతో పాటు ఇరు కుటుంబాల వారు క్లీంకార పుట్టినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. గతేడాది ఉపాసన పుట్టినరోజు నాడు చరణ్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఇప్పుడు దాన్నే మరోసారి ఆమె పంచుకున్నారు. పాప పుట్టిన సమయంలో తమ కుటుంబంలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో అన్న అంశాన్ని ఈ వీడియోలో చూపించారు. దీంతో ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: