బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదనుకోండి. ఎందుకంటే బాలీవుడ్లో తనకి ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో టాలీవుడ్ లో కూడా అంతే ఉంది అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఇదివరకే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ తో దీనిపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర బృందం. ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్ కి దీపిక పదుకొనే సైతం వచ్చింది. ఇక దీపికా పదుకొనే ఆ ఈవెంట్లో చేసిన సందడి మామూలుగా లేదు. దాంతో తనకి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ లో దీపికా పదుకొనే బేబీ బంప్ తో కనిపించింది. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తలెసిందే. అయితే సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె బేబీ బంప్‌ కనిపించేలా వచ్చింది.

 బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ ధరించింది.. ఆ డ్రెస్సులో దీపికా బేబీ బంప్స్ ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనెతోపాటు ప్రభాస్‌ పాల్గొని ఈ సినిమా అనుభవాన్ని పంచుకున్నారు.  కల్కి 2898ఏడీ` సినిమా ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. భైరవ థీమ్‌ సాంగ్‌ని విడుదల చేశారు. దీంతోపాటు `కల్కి కథ ఎలా పుట్టిందో వివరించాడు అశ్విన్.. ముంబైలో ప్రమోషన్ లో భాగంగా భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.. రానా హోస్ట్ చేశారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం తెలుగు సినీ ఆడియన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: