కోలీవుడ్ నటుడు కార్తీ అంటే అందరికీ తెలుసు. ఈయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సూర్య ఫ్యామిలీ నుండి కార్తీ కూడా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.ఈయన కూడా సౌత్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే అలాంటి కార్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వదిన హీరోయిన్ జ్యోతిక గురించి సంచలన విషయాలు బయట పెట్టారు.అయితే గత కొద్దిరోజుల నుండి కోలీవుడ్ మీడియాలో జ్యోతిక వల్ల సూర్య ఫ్యామిలీ విడిపోయినట్టు ఎన్నో వార్తలు రాసుకోస్తున్నారు. అయితే ఈ రూమర్స్ అన్నింటి పై కార్తీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.కార్తీ స్పందిస్తూ.. మా వదిన వల్ల కుటుంబం విడిపోయింది..ముక్కలు అయిపోయింది.. అంటూ ఏవేవో రాస్తున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.నిజం చెప్పాలంటే మా వదిన ఉన్నప్పుడే మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. ఏ అవసరం వచ్చినా అందరి అవసరాలు తీర్చేది. మా వదిన లేకపోతే అసలు ఇంట్లో ఉండ బుద్ధి కావడం లేదు.ఆమె లేక ఇల్లంతా బోసిపోయింది.కానీ ఏం చేయగలం ప్రస్తుతం పిల్లలు పెద్దవ్వడంతో అన్నయ్య వదిన ఇద్దరు పిల్లల చదువుల కోసం ముంబైకి వెళ్ళిపోయారు.
ఇన్ని రోజులు మా ఫ్యామిలీ అంతా బాగా కలిసి ఉన్నారంటే దానికి ప్రధాన కారణం మా వదినే అంటూ కార్తీ జ్యోతిక గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇక కార్తీ స్పందించిన తీరుతో సూర్య ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని, జ్యోతిక వల్ల ఇంట్లో ఎలాంటి విభేదాలు రాలేదని స్పష్టమైపోయింది.హీరో కార్తీ తన వదిన జ్యోతిక గురించి పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నది. వారి కుటుంబంలోని ఆప్యాయతలకు అద్దంపట్టేలా ఉంది ఆ పోస్ట్‌. వివరాల్లోకెళ్తే, సీనియర్‌ తమిళహీరో శివకుమార్‌ తనయులుగా తెరంగేట్రం చేసిన సూర్య, కార్తీ ప్రస్తుతం స్టార్‌హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. విశేషమేంటంటే వారిది మొన్నటివరకూ ఉమ్మడి కుటుంబం. అయితే ఈ మధ్య ఎందుకో సూర్య, జ్యోతిక తమ పిల్లలతో ముంబయిలో సెటిల్‌ అయ్యారు. షూటింగ్‌లు ఎక్కువగా చెన్నయ్‌లోనే ఉండటం చేత సూర్య అటూఇటూ తిరుగుతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: