టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే బలగం మూవీతో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న వేణుతో నానిసినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక నాని కూడా వేణుతో సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ గానే ఉన్నట్లు తెలిసింది.

ఇక కొన్ని రోజుల క్రితమే వేణు, నానికి తాను తయారు చేసిన కథను వినిపించగా, అది తాను ఇప్పటికే నటించిన దసరా మూవీ కథకు చాలా దగ్గరగా ఉండడం, అందులోని క్యారెక్టర్ దసరా మూవీలోని క్యారెక్టర్ దాదాపుగా సేమ్ ఉండడంతో మరోసారి ఇలాంటి కథతో సినిమా చేస్తే అది వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో నాని, వేణు తయారు చేసిన కథను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాను సరిపోతా శనివారం సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఒక మూవీలోను, వేణు దర్శకత్వంలోనూ ఒక మూవీలోను చేయాలి అని అనుకున్నాడు.  కానీ బడ్జెట్ ఎక్కువ అయింది అనే ప్రాబ్లం తో సుజిత్ మూవీ మొదటి క్యాన్సిల్ అయింది. కథ సమస్య వల్ల వేలుతో మరో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.  

ఈ రెండు మూవీలు ఇప్పటికే క్యాన్సల్ కావడంతో నాని సరిపోదా శనివారం మూవీ తర్వాత వెంటనే ఓ మూవీ ని స్టార్ట్ చేయాలి అని ఉద్దేశంలో ఉన్నట్లు అందులో భాగంగా హిట్ సిరీస్ దర్శకుడు అయినటువంటి శైలేష్ కొలను దర్శకత్వంలో తన తదుపరి మూవీని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిట్ 2 మూవీ చివరలో హిట్ 3 సినిమాలో నాని హీరోగా కనిపించబోతున్నట్లు మూవీ యూనిట్ చూపించింది. దానితో ప్రస్తుతం నానికి కూడా ఏ సినిమాలు లేకపోవడంతో శిలేష్ ఈ మూవీ పైనే వర్క్ చేస్తున్నట్లు , అంతా సెట్ అయితే నాని,  శైలేష్ కాంబోలో మరికొంత కాలంలోనే హిట్ 3 స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: