మోస్ట్ బ్యూటిఫుల్ నటి కం యాంకర్ అయినటువంటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ బిగినింగ్ లో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ వాటి ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయంలోనే ఈమె ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఈ షో సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు యాంకరింగ్ రంగంలో అవకాశాలు పెరిగాయి. అలాగే సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో ఈమె ఓ వైపు యాంకరింగ్ రంగంలో బిజీగా ఉంటూనే, మరో వైపు సినిమాలు కూడా చేస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

జబర్దస్త్ కామెడీ షో లో ఎంతో మంది రష్మిక పై పంచులు వేసిన సందర్భాలు ఉన్నాయి. దానిని కూడా ఆమె చాలా పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళుతూ ఉంటుంది. ఇక షో లో కామెడీ కోసం అనేక మంది కమెడియన్ లు రేష్మి పై పంచులు వేయడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా జబర్దస్త్ కామెడీ షో లో భాగంగా నూకరాజు అనే నటుడు రేష్మి పై కొన్ని జోకులు వేశాడు. అందుకు రష్మీ చాలా సీరియస్ గా స్పందించింది. రష్మీ... నూకరాజు మధ్య అసలు ఏం జరిగిందంటే... తాజాగా జబర్దస్త్ యూనిట్ ఈ వారంకు సంబంధించిన ప్రోమో ను విడుదల చేసింది.

ఇందులో ఏంటి రేష్మి అని నూకరాజు ముందుగా రేష్మి నీ పలకరించాడు. దానితో రేష్మీ స్కిట్ లో ఏమైనా కామెడీ ఉంటుందా... లేదా అంటూ అతనికి పంచ్ వేసింది. ఆ తర్వాత ఆమె రెండు , మూడు సార్లు చెప్పిన వినకుండా నూకరాజు బిహేవ్ చేశాడు. దానితో విసిగిపోయిన రేష్మీ నీకు ముద్దు పెడతా ఇటు రా అని పిలిచింది. దానితో నూకరాజు వెంటనే ఆనందంతో ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే చెప్పు తీసుకొని కొడతాను అని ఆయనకు వార్నింగ్ ఇచ్చింది. దీంతో నూకరాజు నవ్వుకుంటూ అక్కడే ఆగిపోయాడు. నిజానికి ఇదంతా చాలా ఫన్నీ గానే జరిగింది. కానీ జబర్దస్త్ నిర్వాహకులు ప్రోమోను హైలెట్ చేసేందుకు దీనిని చాలా సీరియస్ గా చూపించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: