సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో వివరం చెప్పలేం. కొంతమంది ఒక దర్శకుడితో సినిమా చేస్తే ఆ దర్శకుడు కనుక మంచి హిట్ ను అందించినట్లు అయితే అతనితో మరో సినిమా చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగా కొంత మంది ఒక సారి ఒక దర్శకుడు హిట్ ఇచ్చినట్లు అయితే రెండవ సారి అతనితో సినిమా చేసే విషయంలో కథ , స్క్రీన్ ప్లే గురించి కూడా పెద్దగా పట్టించుకోకుండా రెండవ సినిమాతో భారీ ఫ్లాప్ లను అందుకున్న వారు కూడా ఉన్నారు. ఇక మరి కొంత మంది ఒక సారి ఒక దర్శకుడితో సినిమా చేస్తే ఆయన గనక ఫ్లాప్ ఇచ్చినట్లు అయితే అతనితో మరోసారి సినిమా చేయడానికి అసలు ఇష్టపడరు.

కానీ మరి కొంత మంది మాత్రమే ఒక సారి ప్లాప్ ఇచ్చిన అతనిలో టాలెంట్ ఉంది అని తెలిస్తే మరొక అవకాశం ఇవ్వడానికి కూడా వెనకాడరు. ఇక ప్రస్తుతం నాగశౌర్య కూడా ఇలానే చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగశౌర్య కొంత కాలం క్రితం పవన్ బాసంశేట్టి అనే దర్శకుడి దర్శకత్వంలో రంగబలి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీతోనే పవన్ దర్శకుడుగా కెరియర్ ను ప్రారంభించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

కాకపోతే ఈ సినిమాలోని కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పవన్ కి పర్వాలేదు అనే స్థాయి గుర్తింపు లభించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన నాగశౌర్య, పవన్ కి మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగశౌర్య కోసం ఒక అదిరిపోయే కథను పవన్ రెడీ చేసినట్లు దానిని ఈ హీరోకి వినిపించగా, ఈయనకు ఆ స్టోరీ సూపర్ గా నచ్చడంతో వెంటనే పవన్ దర్శకత్వంలో మరో మూవీ చేయడానికి నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి పవన్ ను నమ్మి రెండో అవకాశం ఇచ్చిన నాగశౌర్య కు ఈ దర్శకుడు మంచి విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ns