ప్రెజెంట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కల్కి. పాన్ ఇండియా లెవెల్ లో హైప్స్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ టీం వర‌స‌ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రంనే కల్కి. నాగస్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీలో దీపిక పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. అదేవిధంగా అమితాబచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటుంది చిత్ర బృందం.

ఈ మేరకు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కు అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్, దీపికా పదుకొనే మరియు ప్రభాస్ తో పాటు అశ్వినీ దత్ కూడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ కి దగ్గుపాటి రానా హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే ఈవెంట్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కల్కి చిత్రానికి సంబంధించిన బిగ్ టికెట్ లాంచ్ చేసిన అనంతరం దాన్ని స్వయంగా అమితాబచ్చన్ కొనుగోలు చేయడం జరిగింది. అనంతరం దాన్ని కమలహాసన్ కు గిఫ్టుగా ఇచ్చారు అమితాబచ్చన్.

ఇక ఈ క్రమంలోనే అమితాబచ్చన్ కల్కి నిర్మాత అశ్విని దత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ ఆయన కాళ్ల ను మొక్కేందుకు ప్రయత్నించారు. వెంటనే అది గమనించిన అశ్విని దత్ వెనక్కి వెళ్ళిపోయారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. మీరేంటి అమితాబచ్చన్.. అశ్వినీ దత్ కాళ్ళు మొక్కుతున్నారు. మీకంటే ఆయన వయసులో చిన్నవారు. మీరు ఆయన కాళ్లు పట్టుకోకూడదు. మీకు అంతగా ప్రేమ ఉంటే హాగ్ చేసుకోండి. అంతేకానీ ఇలా కాళ్ళు మొక్కడం మాకు ఏమాత్రం నచ్చలేదు. అంత పెద్ద నటుడు అయ్యుండి మీరు అశ్వినీ దత్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారంటే మీ మనస్తత్వం ఏంటో మాకు అర్థమైంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: