టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతోమంది అవుదామని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే దక్కుతుంది. అలా దక్కించుకున్న వారిలో శృతిహాసన్ కూడా ఒకరు. స్టార్ హీరో కమల్ హాసన్ పెద్దకూతురుగా శృతిహాసన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అమ్మడు సలార్ అండ్ హాయ్ నాన్న చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఇక ప్రస్తుతం స‌లార్ పార్ట్ 2 లో సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక శృతిహాసన్ పర్సనల్ విషయానికి వస్తే... ఈ అమ్మడు గత కొద్ది కాలంగా శాఃతను  తో రిలేషన్ కొనసాగించి ఇటీవల బ్రేకప్ చేసుకుంది. ఇక ఈ విషయాన్ని శృతిహాసన్ తన ఫ్యాన్స్ తో చిచ్చాట్ చేసి కన్ఫర్మ్ చేసింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు పెడుతుంది శృతిహాసన్. ఈ క్రమంలోనే తాజాగా శృతిహాసన్ ఉదయం 3 గంటలకే లేచి ఓ పని చేస్తానంటూ షాకింగ్ పోస్ట్ పెట్టింది.

అందరూ పడుకుంటే ఉదయం 3 గంటలకు లేచి నా బెస్ట్ ఫ్రెండ్ కు రీల్స్ అండ్ మీన్స్ షేర్ చేస్తానని.. తెలుపుతూ ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో నెట్టింట‌ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ని చూసిన వారంతా.. మంచి గొప్ప పని చేస్తున్నావులే. అయినా బ్రేకప్ అయిన తర్వాత నిద్ర పట్టడం లేదేమో. అందుకే ఉదయం 3 గంటలకి లేచి ఇలా ఫ్రెండ్ కి రీల్స్  షేర్ చేస్తున్నావ్. నీ పనే బాగుంది. ఉదయం మూడు గంటలకి లేసి ఫ్రెండ్ కి రీల్స్ షేర్ చేస్తున్న నిన్ను మీ పేరెంట్స్ ఏమీ అనడం లేదు. అదే మా ఇంట్లో పేరెంట్స్ అయితే నా..అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: