రష్మిక మందన్న ఏమంటా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందో తెలియదు కాని.. రయ్..రయ్.. అంటూ దుసుకుపోతోంది రష్మిక మందన్న. ఇటు టాలీవుడ్, బాలీవుడ్ అని లేదు.. పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేస్తుంది శ్రీవల్లి. ఇక క్రేజ్ తో పాటు..రెమ్యూనరేషన్ లో కూడా నయనతార, త్రిషలను పక్కను నెట్టేసిందట కన్నడ కస్తూరి.. ఇంతకీ ఆ కథేంటంటే..?వచ్చేప్పుడు నక్క తోక తొక్కి ఉంటుంది అంటున్నారు ఆడియన్స్. తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచి.. అన్ని బంపర్ ఆఫర్లు.. సూపర్ హిట్లు.. చాలా కులాసాగా తన కెరీర్ సాగిపోతోంది. అటు పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు.. ఇటు కోట్లు వెనకేసుకుంటుందట స్టార్ బ్యూటీ.వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్లు కొట్టేస్తున్న రష్మిక మందన్న.. ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో ఆఫర్ల మీద ఆఫర్లు వెనకేసుకుంటుంది. ఇది చాలదన్నట్టు..పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ ను కూడా బ్యాగ్ లో వేసుకుంది బ్యూటీ. అంతేనా.. నేషనల్ క్రష్ అంటూ బిరుదు కూడా సాధించింది.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. హీరోయిన్ల విషయంలో ఈ సామెత కరెక్ట్ గా సరిపోతుంది. హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ.. కెరీర్ ను లాంగ్ టామ్ సాగదీసిన వారు చూడా చాలా తక్కువ మంది. అందుకే ఫెయిడ్ అవుట్ అవ్వకముందే ఆర్ధికంగా.. ఇమేజ్ పరంగా గట్టిగా సెటిల్ అయితే... ఆతరువాత హ్యాపీగా ఉండొచ్చు అని చాలామంది ఆలోచిస్తున్నా. అలా ఆలోచించకుండా ఇష్టవచ్చినట్టు చేసిన తారలు.. కనిపించకుండా మాయమైపోయారు కూడా.

 ఇక ఆతప్పును చేయకూడదు అనుకుందో ఏమో.. రష్మిక మందన్న.. వరుసగా రెమ్యునరేషన్లు పెంచేస్తోంది. సంపాదించిన సొమ్ము కూడా తన తండ్రి బిజినెస్ లలో పెట్టేస్తోందట. ఆమధ్య కన్నడ నాట ఈ టాక్ గట్టిగా వినిపించింది. అయితే తాజాగా రష్మిక మరోసారి తన రేటు పెంచినట్టు తెలుస్తోంది.రెమ్యునరేషన్ విషయంలో రష్మిక స్టార్ హీరోయిన్లను కూడా దాటేసిందట. ఇప్పటి వరకూ గట్టిగా వసూలు చేస్తున్న తారల్లో నయనతార, త్రిష ఉన్నారు. వారు సినిమాకు 12 కోట్ల వరకూ తీసుకుంటున్నారట. కాని రష్మిక వారిని కూడా క్రాస్ చేసి.. సినిమాకు 15కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందని సినిమా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈరకంగా వారిద్దరిని పక్కకునెట్టేసిందట నేషనల్ క్రష్.బాలీవుడ్ లో రష్మికకు మంచి ఆఫర్ వచ్చింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'సికిందర్' సినిమాలో నటించేందుకు రష్మిక మందన్న 15 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. కాని అక్కడి ప్రొడ్యూసర్లు 13 కోట్లకు ఓకే అన్నట్టు సమాచారం.ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. యానిమల్ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత ఆమెడిమాండ్ బాలీవుడ్ లో కూడా పెరిగింది. ప్రస్తుతం పుష్ప2 లో అల్లు అర్జున్ జోడీగా నటిస్తోంది బ్యూటీ.. ఈమూవీ అగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సింది.. కాని రీసెంట్ గా డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేస్తూ.. అనౌన్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: