జబర్దస్త్ రీతూ చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మొదట సీరియల్స్ తో తన కెరీర్ను ప్రారంభించిన ఆమె ఆ తరువాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక జబర్దస్త్ లో  లేడీ కమెడియన్గా తన సత్తా ఏంటో చూపించింది. ఆ తర్వాత కూడా ఇటు జబర్దస్త్ అటు సీరియల్స్ చేస్తూ బాగా బిజీ అయింది. అలా తనకి పలు షోస్ లో కూడా నటించే అవకాశాలు రావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.  అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కేవలం సోలు మాత్రమే

 కాకుండా ఇటు సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిరంతరం తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే జబర్దస్త్ లో ఈమె ప్రేమ ప్రయాణం అప్పట్లో బాగా సెన్సేషనల్ అని చెప్పొచ్చు. జబర్దస్త్ కమెడియన్ అజర్ తో ప్రేమాయణం నడిపింది ఈమె. అదే విధంగా ఆయనతో స్కిట్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యింది. సుధీర్ రష్మీ సైతం ఇలాగే చేస్తూ బాగా గుర్తింపుని తెచ్చుకున్నారు. రీతూ చౌదరి సైతం వీళ్ళని ఫాలో అవుతూ మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంది కానీ అదంతా ఫ్లాప్ అయింది. ఇదిలవుండగా తాజాగా ఈ

 చిన్నది లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఖరీదైన టొయోటో హైక్రాస్ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపింది. దాని విలువ అక్షరాలా.. రూ.30 లక్షలు పైనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెలబ్రిటీలందరూ ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తున్నారు. తల్లితో కలిసి షోరూం కు వెళ్లిన రీతూ.. తన కొత్త కారుకు పూజ చేసి డెలివరీ తీసుకుంటున్న వీడియోను అభిమానులతో షేర్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. ఇంత లగ్జరీ గా బతకడానికి అంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది. అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: