టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారు సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రెబల్ స్టార్ ప్రభాస్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరు ఆరుగురు కూడా తెలుగులో అత్యంత క్రేజ్ కలిగిన హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే వీరిలో పవన్ కళ్యాణ్ చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా రాజకీయ పనులతో బిజీగా ఉండడం వల్ల ఈయన సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు పెద్దగా బయటకు రావడం లేదు. ఇక మహేష్ తన తదుపరి మూవీ రాజమౌళి చేయనున్నాడు.

ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ మూవీ జూన్ 27 వ తేదీన విడుదల కానుంది. ఇక మారుతీ దర్శకత్వంలో ప్రభాస్మూవీ లో నటిస్తున్నాడు. కల్కి సినిమా విడుదల తర్వాత ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ లను విడుదల చేస్తాం అని ఈ మూవీ బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీని డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఐదుగురికి సంబంధించిన మూవీల విషయంలో పక్కా క్లారిటీ ఉంది. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చిన కూడా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించడం లేదు. మరి దానితో చరణ్ అభిమానులు గేమ్ చెంజర్ యూనిట్ పై గుర్రుగా ఉన్నారు. ఇకనైనా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: