పాన్ ఇండియా లెవెల్ లో సౌత్ సినిమాలు సూపర్ గా సత్తా చాటుతున్న టైం లో బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ మేకర్స్ మీద బాగా దృష్టి పెట్టారు. ఇప్పటికే తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటే ఆల్రెడీ కమిటైన హిందీ హీరోల సినిమాలపై సూపర్ బజ్ ఏర్పడుతుంది.ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ బాలీవుడ్  స్టార్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో సికందర్ అనే సినిమా కన్ఫర్మ్ అయ్యింది. తమిళంలో శివకార్తికేయన్ తో మురుగదాస్ చేస్తున్న సినిమా పూర్తి కాగానే వెంటనే సల్మాన్ ఖాన్ తో చేసే సినిమా లైన్ లో ఉంది.సికందర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ముఖ్యంగా X లో విపరీతమైన బజ్ ఏర్పడింది. సల్మాన్ ఖాన్ ఇంతక ముందు సినిమాల కన్నా సికందర్ మీద ఈ క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు మురుగదాస్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్ టాప్ స్టార్స్ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో మురుగదాస్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ట్రాక్ రికార్డ్ ఉంది.


ఇప్పుడు ఆ ట్రాక్ రికార్డ్  సల్మాన్ కి కలిసి వస్తుందని సల్మాన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.అందుకే సల్మాన్ తో చేసే ఈ సినిమాకు ఈ రేంజ్ బజ్ వచ్చింది. ఇంకా అంతేకాదు సల్మాన్ ఖాన్ కి ఈమధ్య సరైన సినిమా పడట్లేదు. 2022 లో 3 సినిమాలు చేసినా కూడా ఏ ఒక్కటి కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఎన్నో ఏళ్ల నుంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న షారుఖ్ ఖాన్ వరుసగా 3 హిట్లతో అదరగొట్టేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ ఖాతాలో ఒక హిట్టు పడాలి. అందుకే ఆ హిట్ మురుగదాస్ సినిమాతోనే సాధ్యమవుతుందని సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.సల్మాన్ ఖాన్ మురుగదాస్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో సునీల్ శెట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పుడేదో పాన్ ఇండియా డైరెక్టర్ అని అంటున్నారు కానీ మురుగదాస్ ఎప్పుడో పాన్ ఇండియా డైరెక్టర్ గా రికార్డులు సృష్టించాడు. మళ్లీ సికందర్ తో తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో మురుగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: