చిత్రం సినిమా తో చాలా మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఈ సినిమా కు తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తో ఉదయ్ కిరణ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్రం తర్వాత మరోసారి తేజ దర్శకత్వంలో సినిమా చేశాడు ఉదయ్. చిత్రం తర్వాత రీమాసేన్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. వరుసగా సినిమా లు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. రీమాసేన్ ఎక్కువగా తమిళ్ భాషల్లో సినిమా లు చేసి ప్రేక్షకులను అలరించింది. తెలుగు, హిందీలోనూ నటించింది. రీమాసేన్ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను 2012లో వివాహం చేసుకుంది.చిత్రం ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. అప్పట్లో కుర్రాళ్ళు ఈ సినిమా ను ఎగబడి చూశారు. ఈసినిమా అప్పటిలో ఊపు ఊపేసింది. ఈ సినిమా తో ఈ ఇద్దరి జోడీ ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఇద్దరూ జోడీ చిత్రం తర్వాత మనసంతా నువ్వే లో కలిసి నటించారు. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా తెలుగులో సీమ సింహం, అదృష్టం, వీడే, నీతో వస్తా, నీ మనసు నాకు తెలుసు, అంజి లు చేసింది.

ఆతర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం, యమగోల మళ్లీ మొదలైంది, ముగ్గురు అనే సినిమా ల్లో కనిపించింది. ఇక పెళ్లి చేసుకొని లకు దూరం అయ్యింది ఈ చిన్నది. రీమా సేన్ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను 2012 లో వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో రీమాసేన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల రీమాసేన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. స్కూల్‌ టైమ్‌లోనే రీమాకి ఫస్ట్ క్రష్ ఉండేదట.. ఆ అబ్బాయి చాలా అందంగా , ఫెయిర్ గా ఉండేవాడట. నిజానికి అలా ఫెయిర్ గా ఉండేవాళ్ళు తనకు అంతగా నచ్చరని.. కానీ అతను మాత్రం బాగా నచ్చాడు అని తెలిపింది. అతన్ని చూస్తూ అలానే ఉండిపోయేదట.. ఒకేసారి పార్టీలో రెడ్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్నాడట అతని చూస్తూ పడిపోయాను.. అతని ఫేస్ ఇప్పుడు గుర్తులేదు కానీ అతని లుక్ మాత్రం ఎప్పటికి మర్చిపోలేను.. అతని డ్రస్ గుర్తుండిపోయింది అని చెప్పుకొచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రీమాసేన్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: