మిల్కీ బ్యూటీ తమన్నా , రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో "అరన్మయి 4" అనే తమిళ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే సారి విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ బాక్ అనే టైటిల్ తో రిలీజ్ అయింది.

ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అటు తమిళ్ , ఇటు తెలుగు లో మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోగా , తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి అనగా జూలై 21 వ తేదీ నుండి ఈ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేటర్ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: