టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో నాగశౌర్య ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన ఆ తర్వాత హీరో గా కెరియర్ ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన నటించిన ఛలో సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈయన నటించిన చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈయన వరుసగా వరుడు కావలెను , కృష్ణ వ్రింద విహారి , పలానా అబ్బాయి పలానా అమ్మాయి , రంగబలి సినిమాలతో వరుసగా అపజాయలను ఎదుర్కొన్నాడు.

ఇకపోతే పోయిన సంవత్సరం విడుదల అయిన పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి రంగబలి సినిమాపై నాగ శౌర్య భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాకు అద్భుతమైన ప్రమోషన్ లను కూడా చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ కి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ దర్శకుడిలో మంచి టాలెంట్ ఉంది అని గ్రహించిన నాగశౌర్య ఈయనకు మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా రంగబలి సినిమాను నిర్మించిన బ్యానర్ అయినటువంటి ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ మరోసారి నాగశౌర్య హీరోగా పవన్ దర్శకత్వంలో మరో మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆల్మోస్ట్ ఈ కాంబోలో మూవీ సెట్ అయ్యింది అనుకునే సమయంలోనే ఈ ప్రాజెక్టు నుండి ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానితో కచ్చితంగా పవన్ తో సినిమా చేయాలి అని డిసైడ్ అయిన నాగశౌర్య కొత్త నిర్మాణ సంస్థను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మరి నాగశౌర్య , పవన్ కాంబో మూవీ ఏ బ్యానర్ లో రూపొందుతుందో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ns