తెలుగు సినీ పరిశ్రమలో మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని ఆఖరుగా బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన మాస్ మహారాజా రవితేజ హీరో గా మైత్రి సంస్థ బ్యానర్ లో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. అందులో భాగంగా ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయింది. దానితో రవితేజ వేరే సినిమాలను చూసుకున్నాడు.

ఇక మైత్రి సంస్థ వారు మాత్రం గోపీచంద్ చేయబోయే తదుపరి మూవీని చేయడానికి కమిట్ అయి ఉన్నారు. అందులో భాగంగా తాజాగా మైత్రి సంస్థ , గోపీచంద్ మలినేని కాంబో మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ కాంబో మూవీ లో బాలీవుడ్ నటుడు అయినటువంటి సన్నీ డియోల్ హీరో గా నటించబోతున్నాడు. నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి రెజినా కసాండ్రా , సయామీ కేర్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. 

సన్నీ డియోల్ కొంత కాలం క్రితం గదర్ 2 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ విజయంతో ఈయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక వీర సింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం , గదర్ 2 ఇలాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత సన్నీ లియోన్ హీరోగా రూపొందనున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇటు తెలుగు , అటు హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. ఈ మూవీ అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gm