ఈ మధ్యకాలంలో ఓటీటిల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే చాలామంది సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది థియేటర్ ఎట్మాస్ఫియర్  ని ఎంజాయ్ చేస్తూ ఉంటే.. మరి కొంతమంది ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని ఇక సినిమా చూడాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలా సినిమాలు విడుదలైనప్పుడు అటు థియేటర్ కు వెళ్ళని ప్రేక్షకులు అందరూ కూడా ఓటీటీలో మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు.


 ఇకపోతే ఇప్పుడు ఇలాంటి ఒక క్రేజీ మూవీ ఓటిటిలో వచ్చేసింది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆనంద్ దేవరకొండ. అన్న రూట్ ఫాలో అవ్వకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఎప్పుడు కొత్తదనంతో కూడిన సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఆనంద్ దేవరకొండ ఇటీవల గంగం గణేశా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీ అటు థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం పెద్దగా హిట్ అవలేదు అని చెప్పాలి. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఏ మూవీనీ కొంతమంది ప్రేక్షకులు విడుదలైనప్పుడు థియేటర్లలో చూడలేదు. దీంతో ఓటీపీలోకి ఎప్పుడు వస్తుందా అని కొంతమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


 ఈ క్రమంలోని ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గంగం గణేశా అనే సినిమా ఓటీపీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్  అవుతుంది  మే 31వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్  ప్రేక్షకులను అలరించింది. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ మూవీలో ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్ లుగా నటించారు. పలువురు జబర్దస్త్ నటులు కూడా ఈ మూవీలో నటించి ప్రేక్షకులను అలరించారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఈ సినిమాను థియేటర్లో చూడకపోతే వెంటనే అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ ని చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: