ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ గురించి చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. కాగా మైథాలజీ, ఫ్యూచరిస్టిక్  అనే కాన్సెప్ట్ తో తిరికేక్కిన  ఈ మూవీపై ఇక భారీ రేంజ్ లోనే అచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అయితే అంచనాలను రెట్టింపు చేసింది. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నే రేంజ్ లో ఇక ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు అన్నది విడుదలైన ట్రైలర్ చూసి అందరికీ అర్థమైంది.


 కాగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. కాగా ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ ఏకంగా అశ్వద్ధామ పాత్రలో కనిపించబోతున్నారు అన్నది తెలుస్తుంది. అదే సమయంలో అటు కమల్ హాసన్ కూడా మరో కీలకపాత్రలో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఇక బాలీవుడ్ లోని మరో హీరోయిన్ దిశా పఠాణి కూడా ఈ సినిమాలో ఘటిస్తూ ఉంది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది  బాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా కొనసాగుతున్న బిగ్ బి అమితాబచ్చన్ ఏకంగా ఒక నిర్మాత కాళ్లు మొక్కారు.


 ఇటీవలే కల్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా బిగ్ బి అమితాబచ్చన్ నిర్మాత అశ్విని దత్ కాళ్లకు నమస్కరించారు. ఇక ఇది కాస్త మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే విషయంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమితాబ్ బచ్చన్ ఇలా చేయడం అశ్విని దత్ సాధించిన విజయాల్లో అత్యున్నతం. ఎన్టీఆర్ నుంచి తాజా యువ హీరోల వరకు ఎవరు కూడా ఇలా చేసి ఉండరు. తన కెరీర్ మొత్తంలో అమితాబ్ బచ్చన్  మరో ఇతర నిర్మాతకు ఇలా చేయడం నేను చూడలేదు అంటూ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: